Breaking News

స్క్రబ్ టైఫస్ (Scrub Typhus)

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, కృష్ణా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది అని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ IAS తెలియచేశారు.

కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండగా, కృష్ణా జిల్లాలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 12 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవి కూడా ప్రధానంగా వ్యవసాయ పనులు చేసే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరంతో వచ్చే కేసుల్లో స్క్రబ్ టైఫస్ గుర్తించబడుతోంది.

ప్రభుత్వ ఆసుపత్రులు, CHC/PHCలు నుండి అందుతున్న నివేదికల ఆధారంగా అనుమానిత మరియు ధృవీకరిత కేసులపై ప్రత్యేక ఇంటి ఇంటి సర్వేల ద్వారా మానిటరింగ్ కొనసాగుతోంది. వ్యాధి గురించి స్క్రబ్ టైఫస్ అనేది ఒరియెంటియా సుట్సుగాముషి (Orientia tsutsugamushi)
అనే బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది పొలాలు, పొదలు, గడ్డి, చెత్తమేడలు వంటి ప్రదేశాల్లో ఉండే సంక్రమిత “చిగర్” మైట్ కాటు ద్వారా మరియు పిల్లి, ఎలుక వంటి పెంపుడు జంతువులు మనుషులకు సోకుతుంది.
సాధారణంగా 6–21 రోజుల లోపు (సరాసరి 10-12 రోజుల్లో) జ్వరం మొదలవుతుంది. అధిక జ్వరం,
తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, కొందరిలో దద్దుర్లు, అలాగే కాటు చోటు వద్ద నల్లటి స్కాట్లాగా
కనిపించే “ఎస్కార్” లక్షణంగా కనిపించవచ్చు.
ప్రభుత్వ చర్యలు కృష్ణా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ పరిధిలో అన్ని GGHలు, CHCలు, PHCలు,
ఉపకేంద్రాల్లో జ్వర కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి, అవసరమైన రక్త నమూనాలు సూచనల మేరకు
పరీక్షలకు GGH లో ఉన్న జిల్లా ప్రజా ఆరోగ్య పరీక్షా కేంద్రం పంపుతోంది.
జ్వర క్లినిక్లు, అవుట్పేషెంట్ విభాగాల్లో స్క్రబ్ టైఫస్పై క్లినికల్ అనుమానం కలిగిన రోగులకు వెంటనే
తగిన యాంటీబయాటిక్ చికిత్స ప్రారంభించేందుకు మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.
ప్రతి ఆస్పత్రులలో డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ తదితర మందులు సమృద్ధిగా నిల్వ ఉంచి, నిర్ధారణ పరీక్షా సదుపాయాలు బలోపేతం చేశారు.
MLHP, ANMలు, ASHAలు సిబ్బంది ద్వారా గ్రామీణ ప్రజలకు స్క్రబ్ టైఫస్ లక్షణాలు, వ్యాప్తి,
నివారణ చర్యలపై IEC కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నారు.

పంట పొలాలు, గడ్డి, పొదలు ఉన్న ప్రదేశాల్లో పని చేసే సమయంలో పూర్తి చేతి గల చొక్కా, పూర్తి
కాలువున్న ప్యాంటు, బూట్లు వంటి రక్షణ దుస్తులు ధరించాలి.దోమల / పురుగుల కాటు నివారణకు
మశకనిరోధక లోషన్లు, క్రీములు, స్ప్రేలు (insect/mosquito repellents) వాడాలి.పొదలు, చెత్త, గడ్డి దగ్గర లేదా బయట పందిరి మీద, నేలపై బోర్లా నిద్రించకుండా ఉండాలి; రాత్రి సమయంలో తప్పనిసరిగా మస్కిటో నెట్ ఉపయోగించాలి.
3 రోజులకు మించి జ్వరం కొనసాగితే, ముఖ్యంగా దద్దుర్లు లేదా చర్మంపై నల్లటి పూత (ఎస్కార్/ESCHAR) కనిపిస్తే, స్వయం మందులు తీసుకోకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రి కు వెంటనే
వెళ్లాలి. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జ్వరం వచ్చిన వెంటనే దగ్గరి PHC/CHC లేదా ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలి.స్క్రబ్ టైఫస్ ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నివారించవచ్చు. కృష్ణా జిల్లా ప్రజలు
అప్రమత్తంగా ఉండి పై సూచనలు పాటించాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

జ్వరం వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయించాలని స్క్రబ్ టైఫస్ ముందస్తుగా గుర్తించి సమయానికి యాంటీబయాటిక్ చికిత్స పర్ ప్రారంభిస్తే పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి పి.యుగంధర్ మార్గదర్శకాలు జారీ తెలియ చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *