Breaking News

అనాధ పిల్లలకు ఆరోగ్య పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అనాధ పిల్లలకు ఆరోగ్య పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాధ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాధ పిల్లలకు జిల్లా కలెక్టర్ ఆరోగ్య కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మంజూరు చేసిన ఈ ఆరోగ్య కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుల మాదిరిగానే అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో ఉచితంగా వైద్య చికిత్సలు పొందవచ్చన్నారు. ఈ కార్డులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా సమన్వయకర్త డాక్టర్ సతీష్, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి పలువురు అనాధ పిల్లలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *