ఏలూరు , నేటి పత్రిక ప్రజావార్త :
సాహిత్య అకాడమీ చైర్మన్ పిళ్ళంగోళ్ల శ్రీలక్ష్మీ తండ్రి రంగారావు మృతి పార్టీకి తీరనీలోటని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరులో ని ఆయన స్వగృహంలో పిళ్ళంగోళ్ళ రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఏలూరు మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ ప్రజా సేవలో పిళ్ళంగోళ్ళ రంగారావు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి ని, కుటుంబీకులను కలసి విచారం వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మి కి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగఢ సానుభూతిని తెలిపి, పరామర్శించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News