-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది. ఫిబ్రవరి 14, 2026, రెండవ శనివారం సెలవు దినము అయినప్పటికీ పన్ను చెల్లింపులకు విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 13 కాష్ కౌంటర్లు అందుబాటులో కలవు అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు .
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 14, 2026 శనివారం సెలవు దినము అయినప్పటికీ, ఇంటి పన్ను , ఖాళీ స్థలాల పన్ను, డ్రైనేజీ పన్ను, నీటి పన్ను చెల్లింపులకు ప్రజల సౌకర్యార్థం నగరపాలక సంస్థ పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పన్ను చెల్లింపులు చేసుకోగలరని కోరారు.
Prajavartha Online Telugu News