గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
2025–26 ఆర్ధిక సంవత్సరము ఆస్తి పన్ను, బకాయిలను చెల్లించుటకు వీలుగా, ఆదివారం శెలవు రోజైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్నుచెల్లింపు కేంద్రాలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు యధావిధిగా పనిచేస్తాయని, బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు ఆస్తి, ఖాళీ స్థల పన్నులు మరియు నీటి పన్నులు పూర్తిగా చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలోని క్యాష్ కౌంటర్లలో నగర పాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను చెల్లించవచ్చన్నారు.
Prajavartha Online Telugu News