Breaking News

మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

-గంజాయి సాగును పూర్తిగా అరికట్టాము
-డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాము
-డోర్ డెలివరీ చేసిన వారి కుటుంబ సభ్యుల పై కూడా దృష్టి పెట్టాం..మంత్రి అనిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏపీ హోంమంత్రి అనిత ప్రకటించారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపామని గుర్తుచేశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో నేరాలు పెరిగాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపణలను..శాసనమండలిలో మంత్రి అనిత తిప్పికొట్టారు. గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని, డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. ఈ సంవత్సరం మహిళపై అత్యాచారాలు, హత్యలు నాలుగు శాతం తగ్గాయని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు.NDA ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిందన్నారు. గంజాయి నిర్మూలనకు ఈగల్ అనే ఒక ప్రత్యేకమైన టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. గంజాయి సాగును జీరో చేశామని అన్నారు. మదనపల్లి ఘటన చాలా బాధాకరమన్నారు. కానీ దారుణానికి ఒడిగట్టిన నేరస్థుడిపై ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి పెరగడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, నేరాలు చేసే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. మహిళా రక్షణ, చిన్నారుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. పోక్సో కేసుల్లో శిక్షలు 15 శాతం పెంచగలిగామన్నారు. 506 మందికి శిక్షలు పడితే.. అందులో 9 మందికి మరణ శిక్షలు పడ్డాయని,
169 మందికి జీవితఖైదు పడిందని చెప్పారు.నేరస్థులకు బెయిల్ రాకముందే శిక్షలు వేయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. Nda ప్రభుత్వం వచ్చేసరికి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి గంజాయి
వెళ్ళిందని, ఇప్పుడు అదే స్కూల్ పిల్లలు రోడ్డు మీదకు వచ్చి గంజాయి వద్దు బ్రో- డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్,గంజాయి కు హాబ్ అని, ఈరోజు గంజాయిని ఎలా అరికట్టాలో ఆంధ్రప్రదేశ్ ను చూసి నేర్చుకునే పరిస్థితి అని చెప్పారు. అందరినీ వెతుకుతున్నాం, ఆఖరికి డోర్ డెలివరీ చేసిన వారి కుటుంబ సభ్యులకు పై కూడా దృష్టి పెట్టామన్నారు. 24 గంటల నుండి 48 గంటల లోపు ఏ నిందితునైన పట్టుకొని అరెస్టు చేస్తున్నామని హోం మంత్రి అనిత అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *