Breaking News

సీఎం చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ కోవెలమూడి రవీంద్ర

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రితో సమావేశం అయిన నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర. గురువారం నగర మేయర్ ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నగర అభివృద్ధికి సంబందిచి పలు అంశాల పై చర్చించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని కాకుమానువారి తోటలోని వెల్ఫేర్ స్థలానికి సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించి, నగరంలోని సదరు భూమిని ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని మేయర్ ముఖ్యమంత్రికి వివరించారు. గుంటూరు నగర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావించామని, సదరు అంశాల పై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. గుంటూరు నగరంలో చేపట్టాల్సిన మౌలిక వసతులు అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రికి వివరించి, గుంటూరు నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర ముఖ్యమంత్రిని కోరామని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ గుంటూరు నగర అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *