Breaking News

అన్న క్యాంటీన్లో ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల అన్నా క్యాంటీన్ అన్నిటిలోనూ ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటున్నామని కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గులాబీ తోట అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు అన్న క్యాంటీన్ ను అధికారులు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారని ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ, వాటికి అనుగుణంగా ప్రతి అన్న క్యాంటీన్లో వసతులలో ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటున్నారని అన్నారు. నిరంతర పారిశుద్ధ్య నిర్వహణతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *