Breaking News

ఆంధ్ర గ్రీన్ అంబాసడర్ అవార్డులు ప్రధానం- సన్మానం

-విజయవాడలో ఆంధ్ర లైఫ్ ఫర్ నేచర్ సమ్మిట్ ముగింపు; పునరుజ్జీవ అభివృద్ధి దిశగా దృష్టి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర లైఫ్ ఫర్ నేచర్ సమ్మిట్ రెండురోజుల కార్యక్రమం విజయవాడలో ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఇది రాష్ట్రం పర్యావరణ సుస్థిరత దిశగా సాగుతున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
సహజ – జీవన – విధానం: ఆంధ్రప్రదేశ్‌లో పునరుజ్జీవ భవిష్యత్తు కోసం లైఫ్ను ప్రధాన స్రవంతి లోకి తీసుకురావడం” అనే అంశంతో నిర్వహించిన ఈ సమ్మిట్‌లో విధానకర్తలు, పర్యావరణ సంరక్షకులు, మీడియా ప్రతినిధులు కలిసి వాతావరణ అనుకూల మరియు ప్రకృతి ఆధారిత అభివృద్ధి కోసం సమిష్టి దృష్టిని ముందుకు తీసుకువచ్చారు.
ఈ సమ్మిట్‌ను సి.ఎం.ఎస్ వాతావరణ్ (ఛంశ్ వాటావాఋఆణ్) సంస్థ, ది హ్యాబిటట్స్ ట్రస్ట్ తో కలిసి నిర్వహించగా, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, ఐయుసిఎన్ (IUCN) #NatureforAll, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) ఇండియా, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (WFP) ఇండియా సంస్థలు మద్దతు అందించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమానికి అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం; ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (APCOST); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియత్రణ మండలి; రాష్ట్ర జీవవైవిధ్య మండలి; సి. రాఘవాచారి మీడియా అకాడమీ; విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్; స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్, విజయవాడ; వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) ఇండియా హైదరాబాద్ కార్యాలయం; గ్రామదీప్ ట్రస్ట్ మద్దతు అందించాయి.
రెండవ రోజు “భాగస్వామ్యాల ద్వారా లైఫ్ అమలు: ఆంధ్రప్రదేశ్‌లో సమాజాలు, సంస్థలు, మీడియా మరియు సామూహిక చర్య” అనే అంశంపై ఉన్నతస్థాయి బహుళ భాగస్వామ్య సంభాషణతో ప్రారంభమైంది.
పర్యావరణ సంరక్షణలో విశేష కృషి చేసిన వ్యక్తులకు “ఆంధ్ర గ్రీన్ అంబాసడర్ అవార్డులు” ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలు:
* కొమెర అంకారావు – అటవీ మరియు పర్యావరణ సంరక్షణలో ఆయన అంకితభావ సేవలకు
* డా. S. మనోహరి వెలమాటి – గ్రామదీప్ ట్రస్ట్ ద్వారా సమాజ ఆధారిత పర్యావరణ పునరుద్ధరణలో నాయకత్వానికి
సి ఎం మెస్ వాతావరణ్ (CMS VATAVARAN) డైరక్టర్ జనరల్ డా. వసంతి రావు మాట్లాడుతూ: “ఈ సమ్మిట్ ముగింపు కాదు. ఇది సామూహిక చర్యకు ఆరంభం. ఇప్పుడు ఆలోచనలు వ్యవస్థలలో మరియు సమాజాలలో సమిష్టిగా అమలులోకి తీసుకు రావాలి” అని పేర్కొన్నారు.
ది హ్యాబిటాట్స్ ట్రస్ట్ (The Habitats Trust) లో టెక్నాలజీ ఫర్ కన్జర్వేషన్ లీడ్  సంతోష్ ఎస్.ఎల్ మాట్లాడుతూ: “పర్యావరణ సంరక్షణ విజయవంతం కావాలంటే సాంకేతికత గ్రామీణ స్థాయికి చేరాలి. సరైన సాధనాలు, జ్ఞానం ఉన్నప్పుడు స్థానిక సమాజాలు జీవవైవిధ్యానికి బలమైన రక్షకులవుతాయి. మా లక్ష్యం సాంకేతికతను క్షేత్ర స్థాయి చర్యలతో కలిపి ప్రకృతికి నిజమైన ప్రభావం సృష్టించడం. ఈ సమ్మిట్ విద్య మరియు సామూహిక అవగాహన ద్వారా పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే కీలక వేదిక” అని అన్నారు.
విశ్రాంత అటవీశాఖాధికారి, మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ & చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ డా. నళిని మోహన్ దెందులూరి మాట్లాడుతూ: “అభివృద్ధి మరియు పర్యావరణం వేర్వేరు మార్గాల్లో సాగలేవు. సహజ వ్యవస్థలను రక్షించడంలో విఫలమైతే, మన అభివృద్ధి పునాదే బలహీనమవుతుంది” అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సి. రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు సమాచార ప్రసారం మరియు ప్రజల భాగస్వామ్య ప్రాధాన్యతను ఉద్ఘాటిస్తూ, “ప్రకృతితో సమన్వయంగా జీవించాలనే సందేశం ప్రతి ఇంటికీ చేరాలి. దీన్ని ప్రజల ఉద్యమంగా మార్చే బాధ్యత మీడియా మరియు సంస్థలపై ఉంది” అని పేర్కొన్నారు.
ఈ సమ్మిట్ చివరగా స్పష్టమైన మార్గదర్శకాన్ని అందించింది:
ప్లానింగ్ మరియు పాలనలో పర్యావరణ అవగాహనను సమగ్రపరచడం, రంగాల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, మార్పుకు సమాజాలను ప్రధాన శక్తులుగా తీర్చిదిద్దడం, దీర్ఘకాలిక సుస్థిర పర్యావరణ అభివృద్ధిని అనుసంధానించడం. ఆర్థిక వృద్ధి, పర్యావరణ భద్రత రెండూ కలిసి ముందుకు సాగే భవిష్యత్తును నిర్మించాలనే ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను ఈ శిఖరాగ్ర సమావేశం పునరుద్ఘాటించింది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *