Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ తక్షణ కర్తవ్యం

-మచిలీపట్నంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 

గత ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నాశనం చేశారు. వారి పాపాల ఫలితంగానే నేడు రెవెన్యూ సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలన్నింటిని కూడా పరిష్కరించాలి. ఇదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. నియోజకవర్గంలో ఇప్పటివరకు 335 ఫిర్యాదులు వచ్చాయి. 296 పరిష్కారం చేశాం. ఇంకా 20 పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ వాటిలో కూడా 14 డిస్పోజ్ చేశాం. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పుకోవాలన్నా ఎవరికి చెప్పుకోవాలో? తెలియని పరిస్థితి. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే వాలంటీర్లను పెట్టి ఫోటోలు తీసి వారిపైనే ఎదురు దాడి చేశారు. కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరిస్తోంది.

ప్రతి వారం నియోజకవర్గ స్థాయిలో ఫిర్యాదులు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్లు వారి పరిధిలో ప్రతి సోమవారం ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ప్రతి శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ ఉంటోంది. ఒకరోజు అటు ఇటుగా ఈ కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నాం. వీటిలో కొన్ని రెవెన్యూ, పోలీస్ కు సంబంధించినవి ఉంటున్నాయి. ఎక్కువగా ఇళ్ల స్థలాల గురించే ఉంటున్నాయి. గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త విధానాలు వల్ల ఇళ్ల సమస్యలు అధికంగా పేరుకుపోయాయి. రాబోయే కాలంలో వీటిని తీర్చేస్తాం. ప్రభుత్వం ఒకపక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా కింద 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం . తల్లికి వందనం కింద రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పిల్లల తల్లుల అకౌంట్లలో వేస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద 20 వేల రూపాయలు చొప్పున రైతు సోదరుల అకౌంట్లో వేస్తున్నాం. కేంద్రం ఇచ్చే రూ.7000 కాకుండా రాష్ట్రం 14000 అదనంగా కలిపి ఇస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం తెచ్చాం.

వైసీపీ అసమర్ధ పాలన జగన్ రెడ్డి వల్ల రాష్ట్రం నష్టపోయింది. కూటమి ప్రభుత్వం ఒక పక్క పొలవరం పనులు వేగవతంగా చేస్తోంది. రేపు పుష్కరాల నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు పారబోతున్నాయి. అమరావతి విషయానికొస్తే నిన్ననే కేంద్రం చట్టం చేసింది. పార్లమెంట్లో, రాజ్యసభల్లో కూడా ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది. చివరకు అమరావతి పేరు కూడా జగన్ కు గిట్టడంలేదు. మావి గన్ అనే కొత్త పదం తీసుకొచ్చాడు. అమరావతి విషయంలో అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు అమరావతికి సపోర్ట్ చేశాయి. అమరావతిని శాశ్వత రాజధానిగా తీసుకురాగలిగాం. అభివృద్ధిని చేసి చూపిస్తాం. రాష్ట్రంలో భారత దేశంలోనే తలమానికంగా నిలబెట్టబోతున్నాం.

మచిలీపట్నంను seeaardeeyelo కలపాలని ప్రతిపాదించాం. జిల్లాలో దాదాపు 11 మండలాలు సీఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. మిగతా మండలాలు కూడా సీఆర్ డీఏ పరిధిలోకి వస్తాయి. ఆపాటి ఇంగిత జ్ఞానం లేదు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి భవిష్యత్ తరాలకు అన్యాయం చేసేందుకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *