విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, గుంటూరులో గుండె శస్త్ర చికిత్సా వైద్య బృందం ఒక విశిష్టమైన వైద్య విజయాన్ని నమోదు చేసింది.
వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 64 ఏళ్ల రోగికి మెలకువలోనే (అవేక్) కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (బైపాస్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆధునిక గుండె వైద్యంలో ఒక కీలక మైలురాయిని సాధించింది.
ఈ రోగి డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో పాటు మూడు గుండె రక్తనాళాల్లో తీవ్రమైన పూడికలతో బాధపడుతూ, గతంలో కుడి ఊపిరితిత్తి క్యాన్సర్‌కు చికిత్స పొందారు. కుడి ఊపిరితిత్తి భాగాన్ని తొలగించే లోబెక్టమీ శస్త్రచికిత్స అనంతరం రేడియోథెరపీ, కీమోథెరపీ కారణంగా ఊపిరితిత్తుల పనితీరు గణనీయంగా దెబ్బతింది. ఈ కారణంగా సాధారణ మత్తుతో చేసే గుండె శస్త్రచికిత్స ఈ రోగికి అత్యంత ప్రమాదకరంగా మారింది.
ఈ క్లిష్ట పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రముఖ సీనియర్ గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జయరాం పాయ్ మరియు సీనియర్ డీ.ఎం అనస్థీషియాలజిస్ట్ డాక్టర్.లోగనాథన్ ఆధ్వర్యంలో, సాధారణ అనస్థీషియా ఇవ్వకుండా మెలకువలోనే బైపాస్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ వినూత్న పద్ధతి వల్ల వెంటిలేటర్ అవసరం లేకపోవడం తో శస్త్రచికిత్స అనంతరం వచ్చే ఊపిరితిత్తుల సంబంధిత సంక్లిష్టతలు గణనీయంగా తగ్గాయి. శస్త్రచికిత్స మొత్తం సమయంలో రోగిని స్థిరంగా ఉంచడం ద్వారా మెలకువలో చేసే ఇటువంటి గుండె శస్త్రచికిత్సలు వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న రోగుల్లో కూడా సురక్షితమని డాక్టర్ జయరాం పాయ్ తెలిపారు.
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ, ఇటువంటి అరుదైన విజయంతో ఊపిరితిత్తుల పనితీరు బలహీనంగా ఉన్న గుండె రోగుల చికిత్సలో కొత్త మార్గాన్ని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చూపించిందన్నారు. అత్యాధునిక సాంకేతికత, వైద్య నిపుణుల నైపుణ్యం, రోగి భద్రతపై ఉన్న కట్టుబాటు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపారు. ఈ గొప్ప విజయాన్ని సాధించిన శస్త్రచికిత్స మరియు క్రిటికల్ కేర్ బృందాన్ని ఆసుపత్రి యాజమాన్యం అభినందిస్తూ, ఇది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడే గుండె రోగుల చికిత్సలో ఒక కొత్త ప్రమాణాన్ని స్థాపించిందని పేర్కొన్నారు.
ఇప్పటివరకు అత్యధిక విజయాల శాతంతో 30,000కు పైగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు, దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన మరియు విజయవంతమైన కార్డియాక్ సర్జరీ కేంద్రాలలో ఒకటిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ప్రత్యేక గుర్తింపు పొందిందని డాక్టర్ రమేష్ బాబు తెలిపారు.
డాక్టర్ జయరాం పాయ్, డాక్టర్ శివ ప్రసాద్, డాక్టర్ మృత్యుంజయ్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ భరత్ సిద్ధార్థ్, డాక్టర్ శ్రీకాంత్ మహాపాత్ర వంటి అనుభవజ్ఞులైన ఆరుగురు సీనియర్ గుండె శస్త్రచికిత్స నిపుణులు కోస్టల్ కారిడార్ లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరు,ఒంగోలు మరియు విజయవాడ నందు వైద్య సేవలు అందిస్తున్నారని నవజాత శిశువులు మొదలుకుని 90 సంవత్సరాల వయస్సు గల వృద్ధుల వరకు వివిధ రకాల క్లిష్టమైన గుండె మరియు రక్తనాళ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి పేర్కొన్నారు.
అత్యంత క్లిష్టమైన మరియు హై-ప్రొఫైల్ శస్త్రచికిత్సలు
హార్ట్ & లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు
కమాండో ఆపరేషన్స్
అయోటిక్ రూట్ & ఆర్చ్ సర్జరీలు
హై రిస్క్ డబుల్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (CABG తో)
అక్యూట్ హార్ట్ అటాక్‌లో ఎమర్జెన్సీ బైపాస్ సర్జరీ
అడ్వాన్స్‌డ్ కార్డియాక్ అండ్ స్పెషాలిటీ సర్జరీలు
అడ్వాన్స్‌డ్ మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలు (MICS)
స్యూచర్‌లెస్ వాల్వ్ రీప్లేస్‌మెంట్
ఎక్స్‌టెండెడ్ సెప్టల్ మయెక్టమీ
పల్మనరీ థ్రోంబో ఎండార్టరెక్టమీ
కెరొటిడ్ బైపాస్ గ్రాఫ్టింగ్
కాంప్లెక్స్ & రీకన్స్ట్రక్టివ్ సర్జరీలు
రీడూ బైపాస్ సర్జరీ
పిల్లల్లో జన్యుపరమైన గుండె శస్త్రచికిత్సలు
లంగ్ సర్జరీలు
వాస్కులర్ మరియుఇతర శస్త్రచికిత్సలు
వాస్కులర్ అన్యూరిజమ్స్ చికిత్స,
పెరిఫెరల్ ఆర్టీరియల్ సర్జరీలు వంటి క్లిష్టతరమైన శస్త్ర చికిత్సలు 50,000కు పైగా చేసిన అనుభవం ఈ వైద్య బృందానికి ఉందని, వీటిలో
25 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు
1,200 వరకు మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలు (MICS),
1,000కు పైగా ఎమర్జెన్సీ బైపాస్ శస్త్రచికిత్సలు,1500 వరకు
నవజాత శిశువుల గుండె శస్త్రచికిత్సలు ఉన్నాయని
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి తెలిపారు.
ఈ పత్రికా సమావేశంలో మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ లోగనాథన్ మరియు క్లస్టర్ బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News