Breaking News

పెనమలూరు నియోజకవర్గంలో ‘జలధార – నీటి భద్రత’ కార్యక్రమం

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం, గండిగుంట మూర్తిరాజుగూడెం ప్రాంతంలో ‘జలధార – నీటి భద్రత’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పంటకాలువల పూడికతీత పనులను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో కలిసి ప్రారంభించిన మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంపొందిస్తూ రైతులకు సమృద్ధిగా నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రారంభించారని తెలిపారు. 100 రోజుల ప్రణాళిక వ్యవసాయ రంగానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని వారు పేర్కొన్నారు.
అలాగే, 90వ దశకంలోనే వ్యవసాయంలో ఇజ్రాయెల్ సాంకేతికతను ప్రవేశపెట్టి, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే విధానాలను రైతులకు పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు దేనని గుర్తుచేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా 90% సబ్సిడీతో డ్రిప్ సేద్య పరికరాలు అందజేస్తూ, రైతులను ఆధునిక వ్యవసాయ వైపు నడిపిస్తున్నారని తెలిపారు.
నాడు డ్రిప్ వ్యవసాయం నుంచి నేడు డ్రోన్ వ్యవసాయం వరకు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు మరియు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *