Breaking News

చంద్రబాబు విజన్ తో మైనారిటీ యువతకు ఉజ్వల భవిష్యత్తు

-రూ. 2.75 కోట్లతో ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు,లైబ్రరీల ఆధునీకరణ
-రాష్ట్రంలో 36 కేంద్రాలకు 216 కంప్యూటర్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పన
-మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
-శిక్షణ కేంద్రాల్లో కొత్త కంప్యూటర్లు, ఆధునిక సాఫ్ట్ వేర్ ఏర్పాటు
-ఏఐ, సైబర్ నెట్ వర్క్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి డిమాండ్ కోర్సులకు శిక్షణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో రూ. 2.75 కోట్లు వ్యయంతో ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాల్లో కొత్త కంప్యూటర్లు, ఆధునిక సాఫ్ట్ వేర్ తో పాటు, లైబ్రరీల ఆధునికరణ చేపడుతున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రూ. 2.75 కోట్లు మొత్తం ప్రభుత్వం మంజూరు చేసి ఉర్దూ అకాడమీకి జమ చేయడం కూడా జరిగిందని మంగళవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని 36 కేంద్రాలలో 216 కొత్త కంప్యూటర్లు, కొత్త యూపీఎస్ లు, లేజర్ జెట్ ప్రింటర్లు, స్కానర్ లతోపాటు ఆధునిక సాఫ్ట్ వేర్ ఏర్పాటు, లైబ్రరీల ఆధునీకరణ చేపడుతున్నట్లు అయన తెలిపారు. ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాల్లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి యువతకు కొత్త కోర్సులు నేర్పించబోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ ), సైబర్ నెట్ వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, జావా, పైతాన్, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి, దేశ విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షకులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు

చంద్రబాబు విజన్ తో మైనారిటీ యువతకు ఉజ్వల భవిష్యత్తు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ తో మైనారిటీ యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నదని మైనారిటీ మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం, ఉర్దూ భాషాభివృద్ధికి సీఎం చంద్రబాబు పక్షపాతిగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. చంద్రబాబు సారధ్యంలోనే ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీల ఆధునీకరణ యువత భవిష్యత్తును అత్యున్నత స్థాయిలో మార్చబోతున్నదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నవ్యాంధ్రలో 36 కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, (65 మంది బోధన సిబ్బంది,25 మంది ఇతర సిబ్బందితో) మరియు 36 ఉర్దూ లైబ్రరీలను కాపాడుకుంటూ రావడం జరిగిందన్నారు. 2014-2019 లో ఉర్దూ అకాడమీకి ఏకంగా రూ. 160.62 కోట్లు నిధులు ను సీఎం చంద్రబాబు విడుదల చేశారని, ఈ నిధులతో శిక్షణ కేంద్రాలు అత్యాధునిక ల్యాబ్ లుగా మారి వేలాదిమంది నిరుద్యోగ యువతకు సాఫ్ట్ వేర్ రంగంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిక్షణను అందిపుచ్చుకున్న యువత ఎంతోమంది దేశ విదేశాల్లోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక అభివృద్ధి వైపు అడుగులు వేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2019-2024 లో ఉర్దూ శిక్షణ కేంద్రాలను, లైబ్రరీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఫరూక్ విమర్శించారు. బడ్జెట్ విడుదల చేయకపోవడంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోయి, మౌలిక సదుపాయాలు దెబ్బతిని, మైనారిటీ యువత కలలు కనుమరుగయ్యే దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక బడ్జెట్ కేటాయిస్తూ రావడం జరుగుతున్నదని మంత్రి వెల్లడించారు. ఉర్దూ శిక్షణ కేంద్రాలను పటిష్టం చేయడం, లైబ్రరీలను ఆధునికరించడం కోసం ప్రతి కేంద్రానికి 5 నుండి 6 కొత్త కంప్యూటర్లు, ప్రింటర్లు ఇతర మౌళిక సదుపాయాలు, ఆధునిక సాఫ్ట్ వేర్ ను ఏర్పాటుచేసి సరికొత్త హంగులతో పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మైనారిటీల జీవితాల్లో వెలుగులు నింపే, యువతకు ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగించే విధంగా శిక్షణ కోసం, లైబ్రరీల ఆధునికరణకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను, ఉర్దూ లైబ్రరీలను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించాల్సిందిగా ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ, డైరెక్టర్ గౌస్ పీర్ లకు మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *