Breaking News

స్వచ్ఛ బందరుని సాకారానికి ప్రజలంతా కలిసి రావాలి

– ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది
– ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా పరిశుభ్రత పాటించాలి
– ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించేలా అధికారులు కృషి అభినందనీయం
– జలధార-జల హారతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్యి పరిశుభ్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, అందులో భాగంగానే ప్రతి నెలా మూడో శనివారం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా “జలధార – జలహారతి” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సెంటర్లోని మంచినీటి చెరువు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడో శనివారం నిర్వహించాలని ముఖ్యమంత్రిగారు పిలుపునిచ్చారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వ్యాధులు విస్తరించకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తు్నాం. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. మచిలీపట్నంలో బందరు డంపింగ్ యార్డులో సుమారు లక్ష టన్నులు పేరుకుపోయింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రిగారి పర్యటన సమయంలో చెత్త కొండను చూశాక రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే ఉందని గుర్తించారు. వీలైనంత త్వరగా రాష్ట్రంలోని చెత్త మొత్తాన్ని తొలగించాలని ఆదేశించారు. మచిలీపట్నంలోని డంపింగ్ యార్డు మొత్తాన్ని శుభ్రం చేసి.. ఆ ప్రాంతంలో పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు సేకరించే చెత్తను శుభ్రం చేయడం కోసం 13 ఎకరాలు కేటాయించాం. అక్కడ ప్రాసెస్ చేసి గుంటూరులోని వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్‌కి తరలించబోతున్నాం.

జిల్లా పరిషత్ సమీపంలోని చెరువు వద్ద పార్కు అభివృద్ధికి రూ.2.72 కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. 1864లో ఏర్పడిన రెండో మున్సిపాలిటీగా బందరుకి పేరుంది. అలాంటి బందరుని అభివృద్ధి పథంలో నడిపించేలా సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో 42వ స్థానంలో ఉంది. టాప్ 10లోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలి. 2014-19 మధ్య మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించగా, రూ.20 కోట్లు ఖర్చు చేశాం. తర్వాత ప్రభుత్వం అభివృద్ధి పనులు పూర్తి చేయకపోవడంతో నిధులు మురిగిపోయాయి. మురుగు నీరు మొత్తం రోడ్లపైకి చేరుతోంది. కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ డ్రైనేజీలను అభివృద్ధి చేశాం. మచిలీపట్నంలో అంతర్గత డ్రైనేజీ అభివృద్ధి కోసం రూ.70 కోట్లు కేటాయించాం. ఈ నెల 25లోగా పనులు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నాం. మరోవైపు ప్లాస్టిక్ నిర్వహణ విషయంలో జిల్లా కలెక్టర్ గారి చొరవ అభినందనీయం. పర్యావరణ పరిరక్షణ.. పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణం చెత్త నిర్వహణ సరిగా లేకపోవడం మాత్రమే. అందుకే ప్రజలంతా చేయి చేయి కలిపి స్వచ్ఛ బందరుని సాకారం చేసే యుద్ధంలో భాగస్వాములు కావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మోటమర్రిబాబా ప్రసాద్, గోపు సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *