Breaking News

రేపల్లె మండలం లో దాదాపు రూ. 65 కోట్లు తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

-బాపట్ల జిల్లాను అభివృద్ధిలో నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దుతాం
-రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి
-జిల్లా ఇంచార్జి మంత్రి :కొలుసు పార్థసారథి

రేపల్లె, నేటి పత్రిక ప్రజావార్త :
బాపట్ల జిల్లా ను అభివృద్ధి లో రాష్ట్రంలో నెం.వన్ జిల్లా చేయలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశని జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్,జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తో కలసి అదివారం రేపల్లె మండలం లో అభివృద్ధి పనుల కు శంఖుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇంచార్జి మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఆరవపల్లె గ్రామం నందు ఉన్న శ్రీ బాల కోటేశ్వర స్వామివారి ని దర్శించుకున్నారు.

అనంతరం ఆరవ పల్లి గ్రామం నందు సి ఆర్ ఐ ఎఫ్ నిధులు రూ. 49 కోట్లతో రేపల్లె నుండి తుమ్మల – గంగడిపాలెం రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయడం జరిగింది. రేపల్లె మున్సిపాలిటీ లిమిట్స్ వద్ద గల రూ. కోటి 5 లక్షల డి యం ఎఫ్ టి నిధులతో ఆర్ కె ర రోడ్డు ను ప్రారంభోత్సవ చేయడం జరిగింది. రేపల్లె మండల కేంద్రం నందు రూ.600 లక్షల తో 33 / 11 కె వి సెమి ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి తో కలిసి జిల్లా ఇంచార్జి మంత్రి మీడియా తో మాట్లాడుతూబాపట్ల జిల్లా ను అభివృద్ధి లో రాష్ట్రంలో నెం.వన్ జిల్లా చేయలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బాపట్ల జిల్లా లోని బీచ్ లను గోవా లోని బీచ్ ల తరహాలో అభివృద్ధి చేసి పర్యటకకులు అధిక సంఖ్యలో వచ్చేలా పర్యాటక రంగ అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి బాపట్ల జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. బాపట్ల జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడం తో అన్ని రంగాలలో కంటే పర్యాటక రంగంల ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
రాష్ట్రంలో చాలా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ మీ అభిమానానాయుడు అనగాని సత్య ప్రసాద్ నియోజకవర్గంలో డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుండి రూ.49 కోట్లు మంజూరు చేయించడం గొప్ప విషయమని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని తెలిపారు. రేపల్లె మండల కేంద్రంలో రూ.600 కోట్ల తో ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణము జరుగుతుంది దీనితో పరిశ్రమల అభివృద్ధికి మరియు రైతుల బోర్లు లకు లో వోల్టేజ్ సమస్య కూడా ఉండదన్నారు.
బాపట్ల జిల్లాను జిల్లా కలెక్టర్ జిల్లా రెవిన్యూ మంత్రి,మాజీ మంత్రి నేను అందరం కలిసి బాపట్ల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలో నే బాపట్ల ను నెం వన్ జిల్లా గా చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రేపల్లె రెవిన్యూ అధికారిణి బి. శ్రీదేవి, ఆర్ అండ్ బి డి నళిని, మండల తహశీల్దార్ ఎంపీడీఓ కూటమి నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *