Breaking News

ఈస్ట్ లండన్ లో ఘనంగా సిబిఎన్ జన్మదిన వేడుకలు

లండన్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు యుకేలోని ఈస్ట్ లండన్ లోని ఈస్ట్ హామ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, జై సీబీఎన్, జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తించారు. యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో తెలుగుజాతి అభ్యున్నతి కోసం చంద్రబాబు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఆత్మగౌరవంతో జీవించడం వెనుక సిబిఎన్ దశాబ్దాల కృషి దాగి ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఈస్ట్ లండన్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు మహిళలు, చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ఏపీలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా యుకేలోని తెలుగు సమాజం పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *