అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కువైట్ (గల్ఫ్)దేశం నందు ఫరవానియా నగరంలో ద్వైహీ ప్యాలెస్ హోటల్ నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు 76 వ జన్మదిన వేడుకలను ఏపీ టీడీపీ యూత్ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ ఖాన్ (గ్రూప్ సభ్యులు)వారి ఆధ్వర్యంలో సుగ వాసియువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ (NRI తెలుగు దేశం) అధ్యక్ష తన ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పఠాన్ ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత ,అభివృద్ధి ప్రదాత ఎంతగానో ఆధరించే తమ అభిమాన నాయకుడు అయిన నారా చంద్ర బాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తదనంతరం కంచన రెడ్డిశేఖర్ మాట్లాడుతూ బడుగు ,బలహీన ,ముస్లిం మైనార్టీ వర్గాల ఆశ జ్యోతి,నిరంతర కృషి వలుడు సంక్షేమ ప్రదాత ,పేదల పెన్నిధి అయిన నారా చంద్ర బాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా విచ్చేసిన తెలుగుదేశం కువైట్ గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి మాట్లాడుతూ సంక్షోభాన్ని కూడా సంక్షేమం గా మార్చగల శక్తి సామర్థ్యాలు కలిగిన నాయకుడు నిరంతర శ్రామికుడు అపర భగీరథుడు, అమరావతి సృష్టికర్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నబీ రసూల్ ,జిలాన్,అద్దె పల్లి చిన్నా రాజు,పద్మరాజు వేణురాజు,తిరుపతి రాజు,పెద్ద నాగూర్,కిరణ్ కుమార్ నాయుడు ,కట్టా నరసింహ నాయుడు,నాని,భాషా,కందల రమేష్,నాగేంద్ర,ఖదురూన్,మందా చలపతి,మల్లికార్జున,చాను,మహబూబ్ బాషా,నాగార్జున ,షామీర్ తదితరులు పాల్గొని తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. చివరగా తెలుగుదేశం ,కూటమి నాయకులు సమక్షంలో భారీ కేకు కటింగ్ చేసిన అనంతరం
వచ్చిన నాయకులకు కార్యకర్తలకు తదితరలకు మంచి విందు భోజనాలు ఏర్పాటు చేశారు.
Prajavartha Online Telugu News