Breaking News

చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే

-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు
-“అజేయుడు” పుస్తకాన్ని ఆవిష్కరించిన పార్థసారధి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ జర్నలిస్ట్ టీడీ ప్రసాద్ “అజేయుడు” పేరిట రచించిన పుస్తకాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆవిష్కరించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థ సారథి మాట్లాడుతూ సీఎం
చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో కొనసాగుతున్న ఆంధ్రపదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావడం మనందరి అదృష్టం అన్నారు. 76 ఏళ్ల వ‌య‌స్సులోనూ రాష్ట్ర అభివృద్ధి కోస‌మే త‌పిస్తున్న చంద్రబాబుపై ఎంత సాహిత్యం వచ్చినా, ఎన్ని పుస్తకాలు రాసినా తక్కువే అన్నారు.
చంద్ర‌బాబు విజ‌న్ ప్ర‌పంచానికే ఆద‌ర్శమని దానిని విశ్వవ్యాప్తం చెయ్యవలసిన బాధ్యత పాత్రికేయులు, రచయితలపై ఉందన్నారు. వెటరన్ జర్నలిస్టుగా ప్రసాద్ ముఖ్యమంత్రి పై మంచి రచనలు చేయడం ముదావహమన్నారు. సహా రచయితగా వ్యవహరించిన సీనియర్ ఫ్రీలన్స్ జర్నలిస్ట్ డాక్టర్ రవి కుమార్ బొప్పన ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వ పటిమపై మంచి వ్యాసాలను రచించి ఈ పుస్తకం లో ప్రచురింప చేశారని మంత్రి కితాబు ఇచ్చారు. కార్యక్రమంలో కనదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యుడు సతీష్, కృష్ణ జిల్లా పరిషత్ సీఈఓ డాక్టర్ జే అరుణ, సీనియర్ తెలుగు దేశం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *