Breaking News

దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పై చర్యలు తీసుకోవాలి… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవాదాయశాఖకు చెందిన భూములను అక్రమంగా అన్యా క్రాంతం చేసి, హిందూ దేవుళ్ళంటే నమ్మకం లేని లెక్కలేని రామచంద్రమోహన్‌కి ఎండోమెంట్ కమిషనర్‌గా చేసే అర్హత లేదని, ఆయనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్‌గా గతంలో ఐఎఎస్‌లని నియమిస్తే, ఇప్పుడు అలా కాకుండా ఐఎఎస్ కానీ వ్యక్తిని ఎలా నియమిస్తారన్నారు. ఏడీసీ1, ఏడీసీ 2 పదవులు 14 నెలలుగా మీ దగ్గర ఎందుకు పెట్టుకొన్నారని కమిషనర్‌ను ప్రశ్నించారు. ఎపిపిఎస్సీ ద్వారా నియమం చేసే పోస్టుల్లో రెండు పోస్ట్‌లు మీరు నియమించుకొన్నారా లేదా? వైజాగ్ నుండి ఒక అధికారి, అన్నవరం ఎవోగా మరొకరికి ప్రమోషన్ ఎలా ఇచ్చారని, నిబంధనలకు విరుద్దంగా పోస్టింగ్స్ ఎలా ఇచ్చారన్నారు. సింహాచలం భూములు 39 కింద తొలగించినందుకు సుజాతకు ప్రమోషన్ ఇచ్చారని పోతిన మహేష్ విమర్శించారు.
ఎక్కడ పని చేసే వాళ్లకు అక్కడే ప్రమోషన్ ఇవ్వాలని 888 జీవో చెబుతోందని, జీవోని పక్కన పెట్టి 46మందికి ప్రమోషన్ ఇవ్వడానికి 15 కోట్లతో బేరం కుదుర్చుకున్నారనీ ఆరోపించారు. కోర్టులో ఉండగా గ్రేడ్ వన్, గ్రేడ్ 2 వాళ్లకు ఎలా ప్రమోషన్ ఇస్తారు? అంటూ ప్రశ్నించారు. రామచంద్రమోహన్ పై 2021లో త్రిమెన్ కమిటీ వేసి విచారణ చేయాలనీ వైసీపీ ప్రభుత్వం చెప్పిందని, అనేక ఆరోపణలు నిజం అవ్వడంతో నాటి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిందని వివరించారు. 2024లో కూటమి ప్రభుత్వం రామచంద్రమోహన్ పై త్రిమెన్ కమిటీ వేసిందనీ, కమిటీ వేసిన కూటమి ప్రభుత్వం ఎందుకు విచారణ ఆపేసిందనీ ప్రశ్నించారు.
రామచంద్ర మోహన్ కాళహస్తిలో 200 ఎకరాలు మాయం చేయడానికి అన్ని అనుమతులు సిద్ధం చేస్తున్నారని, 250 కోట్ల విలువైన భూములు తక్కువ ధరకు వేరే వాళ్లకు కట్టబెట్టానికి సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. గొల్లపూడిలో 18 ఎకరాల భూములు అన్యాక్రాతం చేయడానికి సిద్ధం అవుతుందనీ ఆరోపించారు. సింహాచలం భూములు, మాన్స ట్రస్ట్, అన్నవరంలో అవినీతి చాలా వున్నాయన్నారు. ఆరు ప్రధాన దేవాలయాల భూముల్లో హోటల్స్ కట్టి మద్యం, మాసం అమ్ముకోవడానికి అనుమతులు ఇవ్వడానికి సిద్ధం అయ్యారనీ పోతిన మహేష్ విమర్శించారు. చంద్రబాబు లక్షన్నర ఎకరాలు అన్యా క్రాంతం చేయడానికి సిద్ద పడితే బీజేపీ వాళ్ళు అన్ని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారని చెప్పారు. రాష్ట్రంలో హిందూ ధర్మం కాపాడాలన్నా హిందూ దేవాలయాల ఆస్తులు కాపాడాలన్నా కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే పోరాటం చేయగలరని, ఈ అంశాన్ని వారి దష్టికి తీసుకువెళతానని అప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. హిందూ ధర్మం, హిందూ దేవాలయాలు, హిందూ దేవాలయాల ఆస్తుల్ని కాపాడుకోవడానికి హిందువులు బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఎండోమెంట్ కమీషనర్‌గా ఐఎఎస్‌ను నియమించి, రామచంద్ర మోహన్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *