Breaking News

ఫ్లూయిడ్ ప్లాంటును పరిశీలించిన అధికారులు

తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లి లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్( ఐ ఓ సి ) డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ప్లాంటును గురువారం సహాయ వ్యవసాయ సంచాలకులు తోటకూర శ్రీనివాస్రావు, తాడేపల్లి మండల తహసిల్దార్ సీతారామయ్య, మండల వ్యవసాయ అధికారి శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే యూరియా పరిశ్రమలకు తరలిపోకుండా ఈ తనిఖ లు చేపట్టారు. ఐఓసీఎల్ ప్లాంట్ యాజమాన్యం వారి నుండి వారికి సరఫరా అవుతున్న టెక్నికల్ గ్రేడ్ యూరియా ఇన్వాయిస్ వివరాలను, సరఫరా చేస్తున్న కంపెనీల వారీగా పరిశీలించారు. ఈ తనిఖీలలో భారత ప్రభుత్వం వ్యవసాయ అవసరాల కోసం సబ్సిడీ ద్వారా సరఫరా అవుతున్న యూరియాను , వేరే అవసరాలకు వాడటం లేదని ధ్రువీకరించారు.యూరియా సరఫరా రైతులకు అందించుటకు గాను ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, వ్యవసాయేతర అవసరాలకు యూరియా వాడకం చేయకూడదని, తదనుగుణంగా జిల్లా కలెక్టర్ తగిన ఆదేశాలు జారీ చేశారని సహాయ వ్యవసాయ సంచాలకులు తెలిపారు . తనిఖీల్లో కంపెనీ మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్ అలేఖ్య, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్ బాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *