Breaking News

మంగళగిరిలో రెండు రోజుల ఫ్యాన్ పార్క్ – జూన్ 5 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్-

-రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా మంగళగిరిలో రెండు రోజుల పాటు ఫ్యాన్ పార్క్‌ను నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు. బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి Apiic భవనం దగ్గర్లో ఉన్న ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఫ్యాన్ పార్క్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లను అభిమానులు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. రేపు దిల్లీ – పంజాబ్, రాజస్థాన్ – హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌లు ప్రదర్శించబడతాయి. ఎల్లుండి గుజరాత్ – చెన్నై, లఖ్‌నవూ – కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌లు ప్రసారం చేయబడతాయని చెప్పారు. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫ్యాన్ పార్క్ కార్యక్రమాలు స్టార్ స్పోర్ట్స్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతాయని తెలిపారు. మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ కార్యక్రమం నిర్వహణ సాధ్యమైందని ఎంపీ పేర్కొన్నారు. అలాగే, మంగళగిరి ప్రీమియర్ లీగ్‌లో 120 జట్లు పాల్గొనడం విశేషమని చెప్పారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంకా, మంగళగిరి స్టేడియంలో జూన్ 5 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మంగళగిరిని అన్ని రకాల క్రీడలకు వినూత్న కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ సానా సతీష్ బాబు స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *