మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమైనదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు క్షేత్రస్థాయిలో అన్ని విధాల సక్రమంగా అమలయ్యేందుకు అందరూ బాధ్యత వహించి సహకారం అందించాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1993లో.పంచాయతీరాజ్ చట్టం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని 1994 నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ఈ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని నిర్వహించుకొని పంచాయతీల్లో చక్కటి ఫలితాలు చూపించిన వారికి అవార్డు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అవార్డులు వచ్చిన వారందరినిబి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నానన్నారు. ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని తయారు చేసుకుని. ఇవాళ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయింపు చేసు చేసుకుంటున్నామన్నారు. మొట్టమొదటి నుంచి కూడా ముఖ్యమంత్రికి పంచాయతీ వ్యవస్థ మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉందన్నారు. ఆనాడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం వచ్చిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పినటువంటి విధానం మనకందరికీ తెలుసు. గ్రామ స్వరాజ్యం అంటే పారిశుద్ధ్యం, మంచినీళ్లు వంటి మౌలిక వసతులు, కల్పించడమే అన్నారు.
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఇంకా చాలా గ్రామాల్లో కొన్ని గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీ కూడా లేదంటే మనం అందరం ఒకసారి ఆలోచించాల్సిన విషయమన్నారు.అందుకనే ఈరోజు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నా ఇంకా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందన్నారు. నిరంతరం ఎంతో శ్రమతో గ్రామ అవసరాలు తీరుస్తూ చేస్తున్న సేవ అమూల్యమైనదని రుణం తీర్చలేనిదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్న బడ్జెట్లో 22,942 కోట్ల రూపాయలు 2026-27 సంవత్సరానికి కేటాయించడం జరిగిందన్నారు.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ కూడా మనం తీసుకొచ్చాం అని చెప్పి చూపించి దేశంలోనే అత్యధికంగా పెద్ద కిలోమీటర్ రోడ్డు వేసినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడుదని కచ్చితంగా మనం చెప్పగలుగుతున్నామన్నారు. ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ కూడా వాటర్ ట్యాంకులు ఎన్ని సంవత్సరాలు అయిందో శుభ్రం చేసి వాటన్నిటిని శుభ్రం చేయించి, మళ్ళీ పెయింట్ వేయించి, ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెయింటెనెన్స్ చూసిన సందర్భాలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రజలు మొట్టమొదట ప్రశ్నించేది అక్కడ పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ సిబ్బందిని అని గ్రహించి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. , అక్కడ టెండర్ కన్సల్టేషన్ జరుగుతా ఉంటది.
వాస్తవానికి నేను వేరే పని మీద ఉన్నా ఇవాళ ఈ పంచాయతీరాజ్ దినోత్సవంలో మీతో పాటు నేను కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందన్నారు. 2019- 24లో రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమం. కొన్ని రకాలుగా నష్టపోయిందన్నారు. . మరి ఉద్యోగ సంఘాలు మీరు కూడా చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. . ఈ ప్రభుత్వం మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేయడానికి ముందుంటుందన్నారు.
ఈరోజు మనం కూడా ఆలోచించాలి రాష్ట్ర బడ్జెట్ ఎంత? కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంత?
వసూలైన నిధులు ఎంత ఉంది అని మీరు కూడా అవగాహన తెచ్చుకోవాలన్నారు..
ఇవాళ పన్నుల రూపంలో మనకు వస్తున్నది లక్షా 5000 కోట్లు అయితే దాంట్లో 99 శాతం నిధులు మన విద్యా వ్యవస్థ, జీతం కింద ఖర్చు అవుతుందన్నారు.
పేదలకి ఇచ్చినటువంటి హామీలు అమలు పరుచుకోవడానికి సూపర్ సిక్స్ లో పెన్షన్లు గానీ, ఉచిత బస్సు గానీ ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు.
అందుకనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ఆదాయాలను ఎలా పెంచాలి?
ఉపముఖ్యమంత్రి కూడా సహకారం అందిస్తున్నారన్నారు.
అనకాపల్లి జిల్లాలో రామ్ బిల్లులో రెన్యూ ఎనర్జీ అనే ఒక సంస్థ 5400 కోట్లతో నిన్న ప్రారంభించామన్నారు
ఇప్పుడు భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు అన్నిటికన్నా కూడా 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయంటే ఒక విజినరీ ముఖ్యమంత్రి రాష్టానికి ఉంటే ఎలా ఉంటుందనే దానికి ఇదే ఒక నిదర్శనం అన్నారు.
ఈ పెట్టుబడులు రావడం వల్ల లాభం యువతకు వారి అవకాశాలు లభిస్తాయన్నారు.
20 లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు కల్పించాలనే లక్ష్యంగ పెట్టుకోవడం జరిగిందన్నారు. . తద్వారా జీవన స్థితిగతులు కూడా మారిపోతాయన్నారు.
ప్రభుత్వం చూపించినటువంటి పాలసీ వల్ల, ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి సవరణల వల్ల ఇవాళ మనకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.
జల జీవన్ మిషన్ కింద 4000 కోట్ల రూపాయలు మంజూరు అయిందన్నారు. ముఖ్యంగా మనం కృష్ణా జిల్లాలో ఎక్కువ శాతం తీర ప్రాంతంలో ఉన్నందున. గ్రామాల్లో బోర్లేస్తే ఉప్పు నీళ్లు పడతాయనీ, ముఖ్యమంత్రినీ, ఉపముఖ్యమంత్రినీ , కృష్ణా జిల్లాని ప్రత్యేక దృష్టితో చూడాలని కోరామన్నారు.
మచిలీపట్నానికి ఈ పరిసర అవనిగడ్డ పెడన నియోజకవర్గాలకు మంచి నీటి కులాయి ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి సహకరించాలని కోరితే తప్పకుండా ఇస్తామని చెప్పారన్నారు. ఆ కార్యక్రమం నెరవేర్చాల్సినటువంటి బాధ్యత వారిపై ఉందన్నారు. మీరు ప్రతి ఇంటిలో ఈరోజు నెల సంవత్సరంలో రోడ్లన్నీ కొంతవరకు చేయగలిగాం.
ఈ ప్రభుత్వం పక్షాన అందరూ ప్రజలకి అవకాశం ఉన్నంతవరకు చేయాల్సినటువంటి బాధ్యత వారిపై ఉందన్నారు.
అందరికీ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు
తెలుపుతున్నామన్నారు
జిల్లా కలెక్టర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ కన్న కలలు గ్రామ సీమలే దేశానికి పట్టుకొమ్మలన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెండు సంవత్సరాలుగా చేసిన కృషితో జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు ప్రస్తుతం స్వచ్ఛ పంచాయతీలుగా కనపడుతున్నాయన్నారు
మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏ రకమైన ధృవీకరణ పత్రం కావాలన్నా గ్రామ పంచాయతీలపైనే ఆధారపడి ఉంటారన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజల జీవితాల్లో చాలా ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
భారత రాజ్యాంగం ఏ స్ఫూర్తితో సవరించారు ఆ స్ఫూర్తి నెరవేరాలని, పూర్తిస్థాయిలో ప్రజలందరికీ అన్ని వసతులు సమకూర్చాలన్నారు.
ఉద్యోగులందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు.
ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో కృష్ణాజిల్లాను అగ్రస్థానంలో నిలుపుతున్న ఉద్యోగులందరికీ అభినందనలు తెలుపుతున్నానన్నారు.
అనంతరం పంచాయతీరాజ్ శాఖలో విశేష ప్రతిభ చూపిన ఉద్యోగులకు మంత్రివర్యులు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంయుక్తంగా ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఇన్చార్జి డిపిఓ డాక్టర్ జే అరుణ, డిఎల్పిఓలు రజావుల్లా, సంపత్ కుమారి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, పలువురు ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News