-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పన్ను చెల్లింపులపై ప్రభుత్వం కల్పించిన రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు కేవలం ఐదు రోజులు మాత్రమే అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రకటన లో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2025- 26 ఆర్థిక సంవత్సరమునకు ఉన్న పన్ను బకాయిలను ఏక మొత్తంలో చెల్లించి 50% వడ్డీ రాయితీని పొందవచ్చని అలాగే 2026- 27 ఆర్థిక సంవత్సరమునకు ముందస్తుగా ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను చెల్లించి 5% రాయితీని పొందవచ్చని, ఈ అవకాశం ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమేనని, కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని, ప్రజల సౌకర్యార్థం పన్ను చెల్లింపులు కేంద్రాలు ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటల వరకు సెలవు దినాల్లో కూడా అందుబాటులో కలవని కమిషనర్ అన్నారు.
Prajavartha Online Telugu News