Breaking News

నగరాన్ని అందంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు – విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరం అందంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, కెనాల్ రోడ్డు, ఎంజీ రోడ్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని అందంగా ఉంచితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, రహదారుల్లో పెట్టిన మూడు చెత్తబుట్టలు కచ్చితంగా ఉన్నాయా లేవా వాటిపైన ఏ చెత్త వెయ్యాలి అని చూపించే స్టిక్కర్లు సరిగ్గా ఉన్నాయా లేదా, ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సరి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే తరచుగా వ్యర్ధాలు ఎక్కువగా వేసే ప్రదేశాలలో ( గార్బేజ్ వల్లరబుల్ పాయింట్స్) అందంగా పెయింటింగ్లు వేసి హరితాన్ని పెంచి, అందమైన ప్రదేశంగా మార్చాలని ఇంజనీరింగ్, హార్టికల్చర్, ప్రజారోగ్యం విభాగం సమన్వయంతో ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర అందానికి భంగం కలిగించే కేబుల్ వైర్లు, ఫ్లెక్సీలు బ్యానర్లు పట్టణ ప్రణాళిక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తొలగించాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *