-నవ శకానికి నాంది.. డా. పులాల చంద్రశేఖర్ ఏడాది పాలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Dr. NTR UHS) వైస్ చాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఏడాది పాలనలో సాధించించిన ప్రగతి. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Dr. NTR UHS) వైస్ చాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ వీసీ గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా విశ్వవిద్యాలయం సాధించిన విజయాలపై హర్షం ప్రతి ఒక్కరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఆయన దూరదృష్టి గల నాయకత్వంలో యూనివర్సిటీ విద్యా, పరిశోధన మరియు పరిపాలనా రంగాల్లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. వైస్ చాన్సలర్ ఆధ్వర్యంలో గడిచిన ఏడాది కాలంలో జరిగిన ప్రధాన కార్యక్రమాలు మరియు సాధించిన విజయాలు.
కీలక పరిపాలనా నిర్ణయాలు & విద్యా కార్యక్రమాలు:
కాన్వొకేషన్ నిర్వహణ:
2025 సెప్టెంబర్ 9న విశ్వవిద్యాలయ 27వ మరియు 28వ కాన్వొకేషన్ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్:
విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాల కోసం 242, 243 మరియు 245వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించారు.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) తో భేటీ:
జనవరి 2026లో NMC చైర్మన్‌తో ప్రత్యేకంగా సమావేశమై అకాడమిక్ ప్రమాణాల పెంపుపై చర్చించారు.
సాంకేతికత – నూతన ఆవిష్కరణలు:
కమాండ్ కంట్రోల్ సెంటర్:
పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పకడ్బందీ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సమగ్ర ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ప్రారంభించారు.
AI ఆధారిత విద్య:
వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ నిపుణులతో వెబెక్స్ సమావేశాలను నిర్వహించారు.
పరిశోధన, శిక్షణ:
రీసెర్చ్ డే: ప్రముఖ శాస్త్రవేత్త డా. యెల్లాప్రగడ సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని 2026 జనవరి 12న ‘రీసెర్చ్ డే’ నిర్వహించి పరిశోధనలకు పెద్దపీట వేశారు.
మానసిక ఆరోగ్యం – MoU:
వైద్య విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకున్నారు.
వెబినార్లు:
“థీసిస్‌ను పబ్లికేషన్‌గా మార్చడం” మరియు “క్రిటికల్ కేర్‌లో ECMO ప్రాధాన్యత” వంటి ఆధునిక అంశాలపై నిరంతరం వెబినార్లు నిర్వహిస్తూ విద్యార్థులకు, అధ్యాపకులకు అవగాహన కల్పించారు.
సామాజిక బాధ్యత:
అంతర్జాతీయ యోగా దినోత్సవం, జాతీయ వైద్యుల దినోత్సవం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ సమాజానికి ఆరోగ్య సందేశాన్ని అందించడంలో విశ్వవిద్యాలయం ముందు వరుసలో నిలిచింది. వైస్ చాన్సలర్ డా. పులాల చంద్రశేఖర్ సమర్థవంతమైన నాయకత్వంలో డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఎదుగుతోందని అధ్యాపక, విద్యార్థి లోకం కొనియాడింది.
ఈ సందర్భంగా ఆయనకు విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బంది హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News