-రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలి…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రవాణా సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సులు మరియు ఇతర రవాణా సేవలు నిరంతరంగా కొనసాగించాలని, రవాణా సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎక్కడైనా నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఆందోళన చెందకుండా సహకరించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు.
Prajavartha Online Telugu News