-జనసేన కార్యకర్త వై.వెంకటపతి రాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు కోసం కృషిచేసిన తనపై అదే నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కుట్రపూరితంగా తనపై దాడులు చేస్తున్నారని బాధితుడు వై. వెంకటపతి రాజు ఆరోపణలు చేశారు. తనపై కేసులు పెట్టి తనను తన తోటి వారిని హింసిస్తున్నారని, దీనికి పోలీస్ వ్యవస్థ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై భౌతిక దాడులకు సైతం పాల్పడేందుకు ఎమ్మెల్యే వెనుక ఉండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యేనుముల వెంకటపతి రాజు మాట్లాడుతూ నియోజవర్గంలో నిస్వార్ధంగా సేవ చేస్తున్న తనకు పేరు వస్తుందన్న అసూయతో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో తనపై నాలుగు కేసులు బనాయించారని, అందులో ఒకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉందన్నారు. ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి తాము ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేశామని, గెలిచిన ఎమ్మెల్యే తమను వేధింపులకు గురి చేయటం బాధ కలిగించిందన్నారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టా ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నానన్నారు. ఎమ్మెల్యే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. తనపై జరిగే దాడులకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యేదే అన్నారు. కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే దేవప్రసాద్ మరియు రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారితో కలిసి తప్పుడు కేసులు పెడుతున్నారని, ఎమ్మెల్యే అవినీతి ఆగడాలపై పూర్తి ఆధారాలతో రాజోలు నియోజకవర్గం బాధితుడు యోనమోల వెంకటపతి రాజు దగ్గర ఉన్నాయని చెప్పారు.
Prajavartha Online Telugu News