Breaking News

ఇంధన సంక్షోభంపై కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ మద్దిల గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఇంధన సంక్షోభంపై తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 70% పెట్రోల్ బంకులు మూతపడటం, నిల్వలు లేకపోవడం వల్ల ప్రజలు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడా ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొనడం సరఫరా నిర్వహణపై అనుమానాలు కలిగిస్తున్నాయని ఎంపీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హార్దీప్ సింగి్ పూరికి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ రాశారు. తక్షణమే జోక్యం చేసుకుని ఇంధన సరఫరాను పునరుద్ధరించడంతో పాటు నిల్వ, దాచిపెట్టడం వంటి అక్రమాలపై విచారణ జరిపి, ఎల్పీజీ ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా అంతరాయం లేకుండా కొనసాగేందుకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *