Breaking News

జిల్లాలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌కు సరఫరా..

-ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పెట్రోల్ డీజిల్ సరఫరా పర్యవేక్షణ..
-వినియోగదారుల అవసరాలకు అందుబాటులో పెట్రోల్ డీజిల్..
-జిల్లాలో ప్రతి రోజు 8 లక్షల డీజిల్ 6 లక్షల పెట్రోల్ సరఫరా..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని ప్రస్తుతం ఎటువంటి కొరత లేకుండా ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని వినియోగదారులు ఎటువంటి అందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ తెలిపారు.
జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరా పై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పర్యవేక్షణ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిడమానూరులో హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్ బంకులను ఎనికెపాడులోని హెచ్‌పిసిఎల్ బంకును రామవరప్పాడులోని ఐఓసిఎల్ బంకులలో పెట్రోల్ డీజిల్ నిల్వలు సరఫరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల వదంతుల కారణంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పాటుడుందనే అపోహలతో వినియోగదారులు బయాందోళనలకు గురై అవసరాలకు మించి డీజిల్ పెట్రోల్ కొనుగోళ్ళు చేయడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. డీజిల్ పెట్రోల్ సజావుగా వినియోగదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా పెట్రోల్ డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకోవడం జరిగిందన్నారు. ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలోని పెట్రోల్ బంక్‌ల వద్ద సరఫరా పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగుతున్నదని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మకుండా అవసరమైన మేరకు మాత్రమే ఇంధనం వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రతి రోజు సుమారు 8 లక్షల లీటర్ల డీజిల్, 6 లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా జరుగుతోందని కలెక్టర్ వెల్లడించారు. ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ పోలీస్ వ్యవసాయ తదితర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎక్కడా ఇంధన కొరత ఏర్పడకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారన్నారు. ఈకారణంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్‌లలో వాహనాలు నిలబడాల్సిన అవసరం లేకుండా తక్షణమే ఆయిల్ పొందగలుగుతున్నారన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీలలో పెట్రోల్ డీజిల్ అవసరాల మేరకు నిల్వలతో సిద్దంగా ఉన్నాయని తెలిపారు. బంకులలో ఆయిల్ అయిపోయిన రెండు గంటలలోపే ట్యాంకర్లతో ఆయిల్ సరఫరా చేసేలా మోనిటరింగ్ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, అవసరానికి తగినంత మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలో ఇంధన సరఫరా పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంధన సరఫరాపై ఎలాంటి సమస్యలు ఎదురైనా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, ఇందుకోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని వినియోగదారులకు ఇబ్బంది తలెత్తిన పక్షంలో 9154970454 నందు సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.

ఆయిల్ బంకుల పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ వెంట విజయవాడ రూరల్ తహాశీల్థార్ బి. సుగుణ, రెవెన్యూ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *