-పైప్లైన్ పనుల కు శంకుస్థాపన చేసిన ఎంపీ చిన్ని ఎమ్మెల్యేసౌమ్య
-40 లక్షల ఎంపీ నిధులతో పైప్ లైన్ పనులు ప్రారంభించారు దశాబ్దాల కాలం నుంచి త్రాగునీటి సమస్యతో అల్లాడుతున్న మునగచర్ల ప్రజలకు దాహార్తిని తీర్చిన ఎంపీ చిన్ని!
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా(నందిగామ) విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న నందిగామ నియోజకవర్గం మునగచర్లకు త్రాగునీటి సమస్యతో దశాబ్దాల కాలం నుంచి అక్కడి ప్రజలు అవస్థలు పొందడం చూసి చలించిన ఎంపీ చిన్ని ఎంపీ నిధులతో కృష్ణా నీటిని తీసుకువచ్చి ప్రజల త్రాగునీటి సమస్యను తీర్చారు ఎంపీ చిన్ని.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పూర్తిగా అరికట్టాలని సదుద్దేశంతోనే ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టడం జరిగిందని ఎంపీ అన్నారు కృష్ణానది నుండి నేరుగా నీటిని సరఫరా చేయడం ద్వారా గ్రామస్తులకు నాణ్యమైన తాగునీరు వస్తుందని అన్నారు. 30 సంవత్సరాలు పైగా మునగచర్ల ప్రాంతంలో నీటి సమస్య ఉన్నప్పటికీ ఎవరు ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారని స్థానికులు ఎంపీ చిన్ని కి తెలియపరిచారు ఈ పైప్ లైన్ పనులు పూర్తయ్యేసరికి త్రాగునీటి సమస్య పూర్తిగా ఈ ప్రాంతంలో ఉండదని ఎంపీ స్పష్టం చేశారు తన పార్లమెంటు పరిధిలో ఎలాంటి సమస్య ఉన్న పరిష్కారం కోసం ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తూనే ఉంటానని ఎంపీ అన్నారు రాబోయే రోజుల్లో మరింతగా ఎంపీ నిధులతో పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రైతు నేతలు నీటి సంఘం అధ్యక్షులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News