విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ఎంపీ కేశినేని చిన్ని మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ ప్రారంభించారు. విజయవాడ( సెంట్రల్) కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఠాగూర్ గ్రంథాలయం విజయవాడ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంపీ కేశినేని చిన్ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. కాకాని భవన్ విజయవాడ లో వేసవి శిక్షణ శిబిరం నీ జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులకు వేసవిలో మంచి కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ విద్యార్థులు సమగ్ర అభివృద్ధికి పౌర గ్రంథాలయాలు ఎంతో కీలకమైన వేదికలని అన్నారు ఇవి కేవలం పుస్తకాలను ఇచ్చే స్థలాలే కాకుండా సాంస్కృతిక మానసిక సృజనాత్మక వికాసానికి కేంద్రాలుగా మారాయని తెలిపారు తాను చిన్నప్పుడే ఠాగూర్ గ్రంథాలయానికి వచ్చానని గుర్తు చేశారు. ఎంతో చరిత్ర గల ఈ గ్రంథాలయాన్ని ఇంకా అదనపు వసతులు కల్పించి రేనోవేషన్ను ఎంపీ లార్డ్స్ నుండి చేయిస్తానని వెంటనే తనకు ఏం కావాలో తెలియజేయాలని చెప్పారు చిన్ననాటి నుండే పుస్తక పఠనం ప్రతి ఒక్క విద్యార్థి అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News