Breaking News

సతీ సమేతంగా యనమలకుదురు5 రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ చిన్ని దంపతులు

-యనమలకుదురు కొండపై వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి నీ సతి సమేతంగా దర్శించుకున్న కేశినేని చిన్ని దంపతులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా( పెనమలూరు) విజయవాడ సమీపంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచి యనమలకుదురులో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామిని కేశినేని చిన్ని దంపతులు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎంపీ చిన్ని ఆయన సతీమణి జానకి లక్ష్మి కి ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు సిబ్బంది మేళతాళాలతో స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ చుట్టుపక్కలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకునే అనేక ప్రధాన ఆలయాల్లో యనమలకుదురు శివాలయం కూడా ప్రత్యేకమైనదని తెలియజేశారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుందని స్వామి అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు తన పార్లమెంటు పరిధిలో మరింత అభివృద్ధి జరగాలని ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశినేని కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *