Breaking News

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40 వ డివిజన్ కు నరహరశెట్టి రాధాక్రిష్ణ హెర్నియా సమస్యతో బాధ పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం 1,99,500 రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అదే విధంగా 52 వ డివిజన్ కు చెందిన వండవాసి సత్యవతి కేన్సర్ వ్యాధితో బాధ పడుతోంది. ఆమెకు వైద్యం కోసం 12,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. వీరిద్దరూ ఆర్ధికంగా స్తోమత లేక పోవడంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను కలిసారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి వీరిరువురికీ అవసరమైన వైద్య సహాయం కోసం సీయం రిలీఫ్ ఫండ్ కు లేఖ రాశారు. దీనికి సంబందించిన ఎల్వోసీ పత్రాలను మంగళవారం బాధితుల కుటుంబ సభ్యులకు అందచేశారు. కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 40 డివిజన్ టిడిపి అద్యక్షుడు పొనుగుపాటి వెంకటసుబ్బయ్య 39వ డివిజన్ జనసేన ప్రెసిడెంట్ ఏలూరు సాయి శరత్ , 45 డివిజన్ బిజెపి ప్రెసిడెంట్ దుర్బేసుల హుస్సేన్, జనసేన నాయకులు తిరుపతి సురేష్, sc సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్, సుజనా మిత్రాలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *