-2 కిలోమీటర్ వాకింగ్ లాంగ్ జంప్ జావిలిన్ త్రో లలో బంగారు పతకాలు సాధించిన జూనియర్ వెటర్నరీ ఆఫీసర్
కల్లు రాజేశ్వరి
-ఈ విజయం వారి కుటుంబానికే కాకుండా పశుసంవర్ధక శాఖకు, రాష్ట్రానికి దేశానికి గర్వకారణం
-జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ కల్లు రాజేశ్వరి సన్మాన సభలో పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర నాయుడు అభినందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల థాయిలాండ్ లో జరిగిన ప్రపంచ మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ – 2026 లో పాల్గొని 2 కిలోమీటర్ వాకింగ్, లాంగ్ జంప్, జావిలిన్ త్రో లలో బంగారు పతకాలు సాధించిన జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ కల్లు రాజేశ్వరి ప్రతిభా పాటవాలు ఒక్క వారి కుటుంబానికి పశుసంవర్ధక శాఖకు మాత్రమే కాకుండా రాష్ట్రానికి దేశానికి కూడా గర్వకారణం అని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర్ నాయుడు, అదనపు సంచాలకులు డా. ఎన్. రజని కుమారిలు కొనియాడారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఆమె అభినందన కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంచాలకులు, అదనపు సంచాలకులు పాల్గొని రాజేశ్వరిని దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. పశుసంవర్ధక శాఖా సంచాలకుల వారి కార్యాలయంలో కల్లు రాజేశ్వరి జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రపంచ స్పోర్ట్స్ లో పాల్గొనడం విజయాలు నమోదు చేయడం దేశం గర్వించతగిన అంశమన్నారు.
ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకూ థాయిలాండ్ లో జరిగిన ప్రపంచ మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ – 2026 లో 40 సంవత్సరాల విభాగంలో రాజేశ్వరి పాల్గొని 3 క్రీడాంశాలలో బంగారు పతకాలు సాధించడం ఎంతో హర్షించతగిన విషయంగా సంచాలకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఆటల పోటీలలో పాల్గొని ఎన్నో విజయాలు నమోదు చేయాలని ఈ సందర్భంగా వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంచాలకులు, అదనపు సంచాలకులు తో పాటుగా పలువురు పశుసంవర్ధక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొని ప్రపంచ స్పోర్ట్స్ లో మూడు విభాగాల్లో బంగారు పతకాలు సాధించిన కల్లు రాజేశ్వరిని ఎంతో ప్రోత్సహించారు.
Prajavartha Online Telugu News