Breaking News

వేసవిలో మొక్కల సంరక్షణకు చర్యలు వేగవంతం చేయాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవిలో మొక్కల సంరక్షణకు చర్యలు వేగవంతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రాణి గారి తోట, నేతాజీ బ్రిడ్జ్, ఎంజి రోడ్, బెంజ్ సర్కిల్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని వర్టికల్ గార్డెన్స్‌ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎండ తీవ్రత వల్ల మొక్కలు ఎండిపోకుండా తరచుగా నీరు పోయడం, అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న వర్టికల్ గార్డెన్స్‌పై అధిక దృష్టి పెట్టాలని, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ గార్డెన్స్‌ను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

అదేవిధంగా, నగరంలోని రోడ్డు డివైడర్లపై మరియు రోడ్ల ఇరువైపులా నాటిన మొక్కలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమయానికి నీరు పోయడం ద్వారా వాటిని సంరక్షించాలని చెప్పారు. అలాగే, అవసరమైన చోట్ల కొత్త మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

కనకదుర్గమ్మ వారధి వద్ద స్లీపింగ్ మిషన్ ద్వారా జరుగుతున్న పారిశుధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్ల చివర్లలో స్లీపింగ్ మిషన్ పనితీరుపై అధికారులకు పర్యవేక్షిస్తూ సరైన చర్యలు తీసుకోవాలని, పరిస్థితి నిర్వహణలో వాహనాల వాడుక సంఖ్యను పెంచుతూ నగర పరిశుభ్రతను పెంచాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో కమిషనర్ ధ్యానచంద్రతో పాటు జోనల్ కమిషనర్ షమ్మీ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *