-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్ను మరియు డ్రైనేజి పన్నుల బకాయిలు వసూళ్ళలో భాగంగా మూడు సర్కిళ్ళ పరిధిలో పన్నుల వసూళ్ళ డ్రైవ్ నిర్వహిస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.
అందులోభాగంగా బుధవారం ఉదయం సర్కిల్ – 1 పరిధిలోని భవానిపురం లో ని బ్యాంకు కాలనీ లోగల 22 ఖాళీ స్థల పన్ను బకాయిదారులకు జప్తు నోటీసు బానరు అంటించారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బకాయిలపై కల్పించిన వడ్డీ పై రాయితీ ఏప్రిల్ 30, 2026 న ముగియుచున్నందున, విజయవాడ నగరపాలక పరిధిలో రెవిన్యూ వసూళ్ళు 100% చెయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారిచేసినందున, రానున్న రోజులలో పన్నుల వసూళ్ళ డ్రైవు మరింత ఉధృతం చేసి మొండి బకాయీదారుల నుండి ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ యాక్ట్ ననుసరించి పన్నుల వసూళ్ళకు నీటి కుళాయిలు మరియు డ్రైనేజి కనెక్షన్స్ ను తొలగించడంతో పాటు సదరు ఆస్తి బకాయిభవనాలను జప్తు చేస్తామని అన్నారు. కావున విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పన్నుబకాయిదారులందరు గమనించి వారికిగల బకాయి పన్నులను విజయవాడ నగర పాలక సంస్త కు చెందిన క్యాష్ కౌంటర్లలోపన్నులను చెల్లించి నగర అభివృద్దికి సహకరించవలసినదిగా కోరారు.
Prajavartha Online Telugu News