Breaking News

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించడం జరిగినప్పటికీ.. నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని సమన్వయ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అదేశించారు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు.
ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీలో జిల్లా కలెక్టర్ తో పాటు కాకాని తరుణ్ (బి.జే.పీ.),గాలంకి వెంకటేశ్వరరావు (బి.ఎస్.పీ.), కందుల పరమేశ్వరరావు (ఏ.ఏ.పీ.) యారడ్ల ఆంజనేయ రెడ్డి (వై.ఎస్.ఆర్.సి.పీ.), ఏదుపాటి రామయ్య (టి.డి.పీ.) జగడం శ్రీనివాసరావు (జనసేన పార్టీ.) తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *