Breaking News

38 పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ వైద్యుల నియామ‌కం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్ఎం) కింద 38 పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ వైద్యుల పోస్టులను వైద్య, ఆరోగ్య శాఖ భర్తీ చేసింది. బోధన, జిల్లా ఆసుపత్రులు, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ కేర్ యూనిట్ల అవసరాల కోసం జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద(అవుట్ సోర్సింగ్‌) విధానంలో భర్తీచేసేందుకు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన నియామక సంస్థ నోటిఫికేషన్ జారీచేసింది. వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు 88 మంది హాజరయ్యారు. వీరిలో 38 మందిని ఎంపికచేశారు. వీరికి త్వరలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వనున్నారు. వీరికి నెలకు రూ.1,10,000 వేతనాన్ని ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారి నెల వేతనం రూ.1.40 లక్షలు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *