-తాడేపల్లిలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రూప్-1 అధికారులు.
-RTOలుగా బాధ్యతలు స్వీకరించిన అధికారులకు మంత్రి అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని 2023 గ్రూప్-1లో విజయం సాధించిన అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్-1 ద్వారా ఎంపికై RTOలుగా నియమితులైన ఆరుగురిని మంత్రి అభినందిస్తూ, తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా నందిపాటి ఎల్.వి. సుబ్బా రెడ్డి, షైక్ ఈసుబ్ సలాం, లగుడు సంతోషి, సి.ప్రియవర్ధిని దత్, గొల్లవిల్లి భరత్ కుమార్, ఇయిత వెంకట రామయ్య అధికారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మంత్రి గారి ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News