Breaking News

టిడిపికి కొత్త ఊపు…

-లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు – రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (వర్కింగ్ ప్రెసిడెంట్‌గా) బాధ్యతలు స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ప్రముఖులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేయడం పార్టీకి నూతన ఉత్సాహాన్ని నింపిందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అభిప్రాయపడ్డారు.

అలాగే జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సేవలో మరింత కృషి చేస్తానని, నాయకత్వం సూచించిన దిశానిర్దేశాలను పాటిస్తూ ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *