విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో స్త్రీ, పురుషుల పవర్ లిఫ్టింగ్ పోటీలను పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఘనంగా నిర్వహించింది. ఈ పోటీల్లో 8 కళాశాలల నుంచి 35 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్త్రీ, పురుష విభాగాల్లో ఓవరాల్ చాంపియన్షిప్ గెలుచుకుంది. అనంతరం పోటీల ఆర్గనైజింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా. మేకా రమేష్ విజేతలకు బహుమతులు అందజేసి, క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే అంతర విశ్వవిద్యాలయ పోటీలు జూన్ 3 నుంచి 8 వరకు చెన్నైలోని హిందుస్థాన్ యూనివర్సిటీలో జరుగుతాయన్నారు. అప్పటి వరకు ఈ తరహా ప్రతిభ ఇలాగే కొనసాగిస్తూ విశ్వవిద్యాలయానికి, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పి.బి. సిద్ధార్థ కళాశాల క్రీడా విభాగాధిపతి డా. టి.వి.బి. కృష్ణారెడ్డితోపాటు వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్‌లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News