విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ప్రగతి పథానికి దిక్సూచి అయిన జన గణన – 2027లో తొలిదశలో భాగంగా ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు ఇండ్ల గణన (CENSUS-2027) జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి 3 రోజులుఎన్యూమరేటర్లందరూవారికి కేటాయించిన ప్రాంతాలను విస్తృతంగా తిరిగి పూర్తి అవగాహన తెచ్చుకుంటారని, తదుపరి ప్రతి ఒక ఎన్యూమరేటర్ వారికి కేటాయించినఅన్ని ఇండ్లను సందర్శించి ప్రజల నుండి వివరాలు స్వీకరిస్తారని, కావున ఇందులో ప్రజలు కీలకభాగస్వాములై ప్రక్రియను విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్&జిల్లా కలెక్టర్, డా. జి.లక్ష్మీశ కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణనలో తొలిసారిగా డిజిటల్ విధానం అందుబాటులోకి వచ్చిందని.. కీలకమైన జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విధిగాబిల్డింగ్ నంబరు, కుటుంబంలో మొత్తం సభ్యులు, ఇంటి యాజమాన్య స్థితి, తాగునీటికి ప్రధాన వనరు, ఇంటర్నెట్ సౌకర్యం, టీవీ సౌకర్యం ఇలా 34 అంశాలకు సంబంధించినవివరాలనుఎన్యూమరేటర్లకి తెలియపరిచి ఇండ్ల గణన ప్రక్రియ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ది.16.04.2026 నుండి 30.04.2026 వరకు https://se.census.gov.in పోర్టల్లోప్రజలు పొందుపరిచిన వివరాలకు సంబంధించి వారికి వచ్చిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐ.డి ని ఎన్యూమరేటర్లకి ఇచ్చిన తర్వాత వారు మీరు పొందుపరచిన వివరాలను చదివి వినిపించిన తరువాత ఏదైనా మార్పులు,చేర్పులు చేయవలసియున్న యెడల ఎన్యూమరేటర్లు సదరు వివరములు సరిచేసి వాలిడేట్ చేస్తారు.
ఇండ్ల గణన మరియు జనగణకు సంబంధించి ప్రజలు ఎటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని మరియు ప్రభుత్య పథకాలకు జనగణకు ఎటువంటి సంబంధం లేదని కావున సరైన వివరాలను విధిగా ఎన్యూమరేటర్లకు తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ 30 రోజుల కార్యక్రమం సజావుగా సాగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా సమీక్షించి ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. మే 1 నుండి 30 వరకు కలెక్టర్ వారి కార్యాలయములో జనగణన ప్రక్రియ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు కంట్రోల్ రూమ్ నెంబర్ 9154970454 అందుబాటులో ఉంటుందని ప్రజలు జనగణనకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్న యెడల పై నెంబర్ ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీడియా పాత్ర కూడా కీలకమని పేర్కొన్నారు. ఇండ్ల గణనలో ప్రజలందరూ పాల్గొని దేశ ప్రగతి నిర్మాణం లో భాగస్వాములు కావాలని కోరారు.
Tags vijayawada
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News