Breaking News

అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం స్వర్ణలత


-వృత్తి పట్ల నిబద్ధత, సేవా దృక్పథం… అదే ఆమె ఆయుధం
– కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నిర్వర్తించే తత్వం
-అదనపు సంచాలకులు స్వర్ణలత కు ఆత్మీయ వీడ్కోలు
-సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాధ్యతల నిర్వహణలో మాత్రమే కాకుండా, అచంచల నిబద్ధతకు, ఉన్నతమైన వృత్తి నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ, శాఖ ప్రతిష్టను మరింతగా పెంపొందించడంలో పదవీ విరమణ పొందుతున్న అధికారులు కీలక పాత్ర పోషించారని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్ తెలిపారు.

స్థానిక ఎన్టీఆర్ పరిపాలనా భవనం రెండవ అంతస్థులోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలో సంయుక్త సంచాలకులు ఎల్. స్వర్ణలత, ఉపసంచాలకులు బి. పూర్ణచంద్రరావు, జూనియర్ అసిస్టెంట్ వి. హరిబాబు ల ఆత్మీయ పదవీ విరమణ వీడ్కోలు సమావేశానికి సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంచాలకులు కే. విశ్వనాథన్ మాట్లాడుతూ… సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించిన ఉద్యోగులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారన్నారు. తమ సుదీర్ఘ సేవాకాలంలో ప్రతి దశలో వారు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడంలో వారు ప్రదర్శించిన సమయస్ఫూర్తి, ఓర్పు ప్రశంసనీయం అన్నారు. తోటి ఉద్యోగులు, జూనియర్ అధికారులకు మార్గనిర్దేశం చేస్తూ, ఆదర్శకులుగా నిలిచారన్నారు. శాఖ కార్యక్రమాల విజయవంతానికి రాత్రింబవళ్లు కృషి చేస్తూ వారు చూపిన అంకితభావం మరువలేనిదన్నారు. పదవీ విరమణ అనేది బాధ్యతల ముగింపు మాత్రమే కాదని వ్యక్తిగత అభిరుచులకు, విశ్రాంతికి దొరికే కొత్త ఆరంభం అని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వారి అనుభవం, వారు నెలకొల్పిన విలువలు శాఖలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయని తెలిపారు.. పదవీ విరమణ అనంతరం వారు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సంచాలకులు ఆకాంక్షించారు. సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్థకాలంపాటు సేవలు అందించిన అదనపు సంచాలకులు తమ పదవీ విరమణ సంతోషం, సుఖశాంతులతో ఉండాలని కే. విశ్వనాథన్ కోరుకుంటున్నట్లు తెలిపారు.

సమాచార పౌర సంబంధాల శాఖలో అదనపు సంచాలకులుగా పదవీ విరమణ చేస్తున్న ఎల్ స్వర్ణలత మాట్లాడుతూ…. 1992 నుండి ఇప్పటి వరకు సుదీర్ఘ కాలం సమాచార శాఖలో సేవలందించారని పేర్కొన్నారు. తనకు కుటుంబం తర్వాత సమాచార శాఖే అంతటి ప్రాముఖ్యమని, ఈ శాఖలోని వారందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేశారని ఆమే భావోద్వేగంతో తెలిపారు. వృత్తిలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, పనిని ఇష్టపడి ఆస్వాదిస్తూ (Enjoyment in the work) చేశానని చెప్పారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (Regional Joint Director) కార్యాలయంలో పనిచేస్తూ జోన్ 1, 2 మరియు 3 పరిధిలోని అన్ని జిల్లాల వారితో సాన్నిహిత్యం కలిగి ఉన్నానని, జోన్ 4 లో విద్యాభ్యాసం జరిగిందని గుర్తుచేసుకున్నారు. తనకు సహకరించిన ఉన్నతాధికారులు, ఇతర మిత్రులు, సహోద్యోగులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఓఎస్డీ డాక్టర్. ఎన్. ప్రకాశరావు, మాట్లాడుతూ.. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో వారు ప్రదర్శించిన ఓర్పు, సమయస్ఫూర్తి అభినందనీయమన్నారు.

పదవీ విరమణ సందర్భంగా ఎల్. స్వర్ణలత, బి. పూర్ణచంద్రరావు, వి. హరిబాబు లు చేసిన సేవలను కొనియాడుతూ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

వీడ్కోలు కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్లు పి. కిరణ్ కుమార్, కస్తూరి బాయి తేళ్ల, ఐ. సూర్యచంద్రరావు, ఛీప్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఓ. మధుసూధన్, ఆర్ఐఈ లు కృష్ణా రెడ్డి, శ్రీధర్ రెడ్డి, డాక్టర్. టి. నాగరాజ, డిప్యూటీ డైరెక్టర్లు పి. తిమ్మప్ప, పి. వెంకట్రాజ్ గౌడ్, డి. రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఏఎస్ వీరభద్రరావు, కే. నారాయణ రెడ్డి, పి. రాజశేఖర్, తిరుపాలయ్య, ఎస్వీ మోహన్ రావు, ఏవో పి. సుదర్శనరావు, జేఈవో నాగరాజు, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *