-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షపు నీటి నిలువలు రోడ్లపై ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం సాయంత్రం తన పర్యటనలో భాగంగా బెంజ్ సర్కిల్, లయోలా కాలేజ్, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, మొగల్రాజపురం, ధర్నా చౌక్ గాంధీనగర్, రామకృష్ణాపురం, దేవినగర్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షపు నీటి నిల్వలు రోడ్ల పైన ఎట్టి పరిస్థితిలో ఉండరాదని, అకాల వర్షానికి మాంసం రెస్పాన్స్ టీం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగిస్తుండాలని అధికారులు పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రతిరోజు డీసిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేయాలని అధికారులను ఆదేశించారు. డీసిల్టింగ్ ప్రక్రియను నిరంతరం జరుగుతూ ఉండాలని, అప్పుడే వర్షం పడినప్పుడు రోడ్లమీద నీటి నీళ్లలో ఉండవని అన్నారు. ఇప్పుడు మీరు కారువలో గుర్రపు డెక్కలు ఎక్కువగా ఉండటం గమనించి ఇంజనీరింగ్ మరియు ప్రజారోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి గుర్రపు డెకలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News