Breaking News

రేపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి రూ. 2720.67 కోట్లు విడుదల

– కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రూ. 63,157.90 కోట్లు పెన్షన్లకు ఖ‌ర్చు చేశామ‌న్న మంత్రి కొండ‌ప‌ల్లి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర‌ ప్రభుత్వం మే 1, 2026న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 62,47,538 మంది లబ్ధిదారులకు రూ. 2720.67 కోట్లు విడుదల చేసింది. గ్రామాలు, వార్డులు, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేసే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్ల కింద 8,141 మంది లబ్ధిదారులకు రూ. 4.15 కోట్లు విడుదల చేసి, మే 1న పంపిణీ చేయనున్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంద‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ నెల విడుదలతో కలిపి మొత్తం రూ. 63,157.90 కోట్లు పెన్షన్ల పంపిణీకి ప్ర‌భుత్వం ఖర్చు చేసింద‌ని మంత్రి తెలిపారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మరియు ఇతర అర్హుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *