Breaking News

వెంకటగిరి ఐఐహెచ్ టీ లో డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (SPKM IIHT) లో డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. రాజారావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ (DHTT) డిప్లొమా కోర్సు లో మూడు సంవత్సరాల మరియు రెండు సంవత్సరాల (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలకు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 30, 2026 గా నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ www.iihtvgr.com ను సందర్శించాలని సూచించారు.

ఇతర సమాచారం కోసం 93999 36872, 98661 69908, 90102 43054 నంబర్లను సంప్రదించవచ్చునని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *