Breaking News

కుటుంబ, గృహ గణన (జనగణన) కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి

-జన గణన సందర్భంగా అందించిన సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది
-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబ, గృహ గణన (జనగణన) కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్ పేర్కొన్నారు. జన గణన (గృహ గణన) నిర్వహణలో భాగంగా ఆవిలాల పంచాయతీ లోని శ్రీనివాస నగర్ లో శనివారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణన 2027 కార్యక్రమాన్ని చేపట్టాయని, ఇందులో భాగంగా ప్రతి కుటుంబం తమ ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్ లకు ఖచ్చితమైన వివరాలను అందించాలని, అలా ఇచ్చిన సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. ఈ సమాచారం క్రోడీకరించి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, తదితర అంశాలను రూపొందించేందుకు ప్రణాళిక తయారు చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సమాచారం అందించాలని కోరారు. జనగణన ద్వారా సేకరించిన సమాచారం నుంచి ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు ఆగవని, ఎలాంటి పథకాలు తొలగించబడవన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *