Breaking News

రైతుకు వెన్నుదన్నుగా ఉంటాం:మంత్రి కందుల దుర్గేష్

-కష్టాల్లో ఉన్న రైతులకు అండగా కాన్వాయ్ ఆపి ధైర్యాన్నిచ్చిన మంత్రి దుర్గేష్…కానూరు వద్ద ధాన్యం రాశుల పరిశీలన
-ఆకస్మిక వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని మంత్రి దుర్గేష్ కు చూపించిన రైతాంగం.. చివరి గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసానిచ్చిన మంత్రి దుర్గేష్
-ఆధునిక సాగు వైపు అడుగులు వేయాలని రైతులకు మంత్రి దుర్గేష్ పిలుపు

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల కష్టమే తన కష్టంగా భావించే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై తన నిఖార్సైన రైతు పక్షపాత వైఖరిని మరోసారి నిరూపించుకున్నారు.తణుకు మండలం వేల్పూరులో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా, మార్గమధ్యలో నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు సమీపంలో రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులను చూసి మంత్రి దుర్గేష్ తన కాన్వాయ్‌ను ఆపారు. నేరుగా రైతుల వద్దకు వెళ్లి ఆకస్మిక వర్షాల వల్ల దెబ్బతిన్న ధాన్యాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. పంట దిగుబడి, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. తేమ శాతం పెరుగుతోందని, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్న రైతులకు ఆయన ధైర్యాన్ని ఇచ్చారు. తేమ శాతం విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రి దుర్గేష్ స్పందిస్తూ.. “ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 25 వరకు ఉన్నా రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాల్సిందే. ఈ విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది” అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోందని తెలుపగా ఈ విధానం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు.. రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఆదాయం ఎక్కువగా వచ్చే ఉద్యానవన పంటల వైపు కూడా దృష్టి సారించాలని ఆయన కోరారు.అధికార హోదాను పక్కన పెట్టి సామాన్యుడి బాధను వినే గుణం గల మంత్రి కందుల దుర్గేష్.. ఆపదలో ఉన్న తమ వద్దకు వచ్చి ధైర్యం చెప్పిన తీరుపై రైతాంగం కృతజ్ఞతలు తెలిపింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *