Breaking News

ఈ నెల 4న ఎ.కొండూరు, తిరువూరు, రెడ్డిగూడెం, గంప‌ల‌గూడెం, విస్స‌న్న‌పేట‌లో ప్రత్యేక గ్రీవెన్స్

– స్థానిక ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 4వ తేదీ సోమ‌వారం ఎ.కొండూరు తిరువూరు, రెడ్డిగూడెం, గంప‌ల‌గూడెం, విస్స‌న్న‌పేట మండ‌ల కేంద్రాల్లో ప్ర‌త్యేక ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎ.కొండూరు కి సంబంధించి ఎంపీడీవో కార్యాలయంలో, మిగిలిన నాలుగు మండలాలకు సంబంధించి ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ఉద‌యం 10 గంట‌ల నుంచి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని, స్థానిక ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌ ప్రత్యక్షంగా, వర్చువల్ గా పాల్గొంటారన్నారు. జిల్లాస్థాయి అధికారులు ఎ.కొండూరు నుంచి మిగిలిన మండలాల్లో జరిగే కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటారని వివరించారు. ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా విజ‌య‌వాడ‌లోని జిల్లా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని .. నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100 కి నేరుగా కాల్ చేయవచ్చని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *