Breaking News

మస్కట్ లో మహిళ వేదనకు స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేషీ అధికారులకు ఆదేశం
-భారత విదేశాంగ శాఖ కార్యాలయాన్ని, దౌత్య కార్యాలయాన్ని సంప్రదించిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబ పోషణ నిమిత్తం మస్కట్ లో పని చేసేందుకు వెళ్లిన అన్నమయ్య జిల్లా, వాల్మీకిపురం గ్రామానికి చెందిన దూదేకుల షెహనాజ్ అనే మహిళ పని ప్రదేశంలో వేధింపులు తాళలేక సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వీడియో సందేశం పంపారు. పవన్ కళ్యాణ్ అన్నా కాపాడన్నా అంటూ రోదిస్తూ ఆమె పంపిన వీడియో ఉపముఖ్యమంత్రి ని కదిలించింది. ఆహారం, నీళ్లు కూడా ఇవ్వకుండా కొడుతున్నారని, ప్రాణాలు పోయేలా ఉన్నాయన్న ఆమె మాటలు విని పవన్ కళ్యాణ్ చలించారు. ఆమెను తక్షణం స్వదేశానికి రప్పించే అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్యాలయ సిబ్బంది షెహనాజ్ ని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె భర్త ద్వారా ఒమన్ లోని ఏజెంట్ తో మాట్లాడారు. అక్కడ దౌత్య కార్యాలయాన్ని, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను సంప్రదించారు. షెహనాజ్ ను సాధ్యమైనంత త్వరగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఉప ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *